Breaking News

ప్రేమ పెళ్లి చేసుకుని కాపాడమంటే... పదివేలు జరిమానా వేసిన హైకోర్ట్..!

03 rd Jun 2020, UTC

ఓ యువజంట తమ కుటుంబాలకు వ్యతిరేకం గా పెళ్లి చేసుకుని కాపాడమని హై కోర్ట్ కి వెళితే... వారికీ హై కోర్ట్ పదివేల జరిమానా విధించిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లో ఓ యువ జంట ప్రేమ లో ఉంది. అయితే.. పెద్దలు వ్యతిరేకించడం తో వారిద్దరూ తమ కుటుంబాలకు వ్యతిరేకం గా వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరు పెళ్లి సమయంలో మాస్క్‌లు ధరించలేదనే కారణంతో వీరిద్దరికీ ఖర్చుల క్రింద రూ.10,000 విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మరో వైపు వీరిద్దరికి రక్షణ కల్పించాలని గురుదాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
          నవ దంపతులు తమ పిటిషన్‌తోపాటు సమర్పించిన పెళ్లి ఫొటోలను హైకోర్టు పరిశీలించింది. పెళ్లి సమయంలో వధూవరులతోపాటు, హాజరైనవారు కూడా కోవిడ్-19 నిబంధనల ప్రకారం ముఖాలకు మాస్క్‌లు ధరించలేదని గుర్తించింది. హోషియార్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌కు రూ.10,000 చెల్లించాలని నవ దంపతులను ఆదేశించింది.  ఈ సొమ్మును... హోషియార్పూర్ లో మాస్కుల పంపిణి కోసం ఉపయోగించాలని కోర్టు ఆదేశించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox