Breaking News

ఢిల్లీ లో అగ్ని ప్రమాదం..!

04 th Jun 2020, UTC
ఢిల్లీ లో అగ్ని ప్రమాదం..!
 
దేశ రాజధాని ఢిల్లీ లో అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండో సారి.  అజాద్‌పూర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్ లో అకస్మాత్తు గా మంటలు చెలరేగాయి.. దీనితో అక్కడి వారు భయబ్రాంతులతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాంప్లెక్స్‌లోని మొదటి, రెండవ అంతస్థుల్లో మంటలు చెలరేగడంతో.. మొత్తం తొమ్మిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం వలన ఎవరికీ హాని జరగలేదు. కానీ.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా..? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అన్నది తెలియరాలేదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox