Breaking News

క్వారంటైన్ లో కుక్క...ఎందుకంటే..!

09 th Jun 2020, UTC
క్వారంటైన్ లో కుక్క...ఎందుకంటే..!
ఎవరికైనా కరోనా సోకిందని అనుమానమొచ్చినా..లేదా ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా వారిని వెంటనే క్వారంటైన్ కు తరలిస్తారు. వారికీ ఎలాంటి లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే..తిరిగి ఇంటికి పంపిస్తారు. అంతే కాదు.. వారు  ఇంటికి వెళ్ళాక కూడా మరో వారం రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. వ్యాధి వ్యాప్తి త్వరితం గా జరుగుతుండడం.. లక్షాణాలు తొందరగా కనపడకపోవడం తో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.. అయితే.. ఈ క్వారంటైన్ సెంటర్ లోకి ఇతర వ్యక్తుల్ని ఎవరిని అనుమతించరు..వారికీ కూడా కరోనా సోకె ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇతరుల్ని అనుమతించారు.
 
            అయితే.. ఇలాంటి ఓ క్వారంటైన్ సెంటర్ లోకి ఓ కుక్కను అనుమతించిన ఘటన  జమ్ముకశ్మీర్‌లోని తకురాయ్‌ గ్రామం లో చోటు చేసుకుంది. విషయం లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌లోని తకురాయ్‌ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్‌కి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరినీ అధికారులు క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిలో.. ఫిల్లార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి క్వారంటైన్ సెంటర్ కు రావడానికి ఓ రిక్వెస్ట్ చేసారు. తనతో పాటు తన కుక్కను కూడా క్వారంటైన్ సెంటర్ కి అనుమతించాలని కోరారు.
           
              కుక్క ఎందుకని...అధికారులు ఆ వ్యక్తిని ప్రశ్నించగా.."నేను ఈ కుక్కను పదివేలు పెట్టి తెచ్చుకున్నాను. నేను క్వారంటైన్ సెంటర్‌కి వస్తే ఈ కుక్కను చూసుకునేందుకు నా ఇంట్లో ప్రస్తుతం ఎవరూ లేరు. అందుకే నేను ఎక్కడుంటే నా కుక్క కూడా నాతో అక్కడే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడట. దీనితో... అధికారులు తొలుత నవ్వుకున్నా... తరువాత పై అధికారులతో చర్చించి  క్వారంటైన్‌ సెంటర్‌లో కుక్కకు కూడా అనుమతిని ఇచ్చారు. ఇక అక్కడ ఆ వ్యక్తి తన కుక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox