Breaking News

కరోనా వైరస్‌ తో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత..!

10 th Jun 2020, UTC

తమిళనాడులో కరోనా  వైరస్‌ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ (62) మృతి చెందారు. కరోనా సోకడంతో గతవారం ఆ‍స్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం  ఉదయం కన్నుమూశారు. ఆయన 63వ పుట్టినరోజు నాడే మరణించడం గమనార్హం. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ఈనెల రెండో తేదీన అన్బళగన్‌ అనారోగ్యానికి గురికాగా పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. చెన్నైలోని క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతిచెందారు.
ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. అన్బళగన్‌ కుటుంబంలోని  ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా వైరస్‌ కారణంగా ఓ ఎమ్మెల్యే మృతి చెందడం ఇదే తొలిసారి.

కోవిడ్‌-19పై పోరులో చురుకుగా వ్యవహరించిన బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ శిరీష్‌ దీక్షిత్‌ (54) మహమ్మారి బారినపడి మరణించారు. మూడు రోజుల కిందట ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటివద్దే దీక్షిత్‌ చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే తీవ్ర అస్వస్ధతకు గురవడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్య బృందం ముంబైలోని మహీం ప్రాంతంలోని ఆయన ఇంటికి చేరుకునేలోగానే బీఎంసీ అధికారి మరణించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox