Breaking News

20 లక్షల కరోనా వ్యాక్సిన్లు సిద్ధం : ట్రంప్

06 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి తీసుకొచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. వేలాది మంది జీవితాలను నాశనం చేసింది. లక్షలాది మంది పొట్ట కొట్టింది. అయితే.. ఈ మహమ్మారి వ్యాప్తి ని అదుపు చేయడం కష్టతరం గా ఉంది. శాస్త్రవేత్తలు సైతం ఈ మహమ్మారిని అంతం చేయడానికి వాక్సిన్ ను కనిపెట్టే పనిలో బిజీ గా ఉన్నారు. ఈలోపు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఓ శుభవార్త చెప్పారు. తమ వద్ద ప్రస్తుతం ఇరవై లక్షల వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలిపారు.   ఆ వ్యాక్సిన్ల పనితీరుపై శాస్త్రవేత్తల రిపోర్టులు రావడమే ఆలస్యమని, అవి రాగానే వ్యాక్సిన్లను వినియోగంలోని తీసుకొస్తామని ట్రంప్ తెలిపారు.ఈ మహమ్మారి కి వ్యాక్సిన్లు తయారు చేయడానికి అమెరికా సైంటిస్ట్స్ లు గొప్పగా పనిచేశారని చెప్పుకొచ్చారు. వారి కృషి వల్లనే వ్యాక్సిన్ సిద్ధమైందని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అమెరికాలో 19 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ మహమ్మారి కారణం గా ఇప్పటికే అమెరికా లో లక్ష మందికి పైగా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox