Breaking News

అయోధ్య రామ మందిరానికి భూమి పూజ..!

10 th Jun 2020, UTC
అయోధ్య రామ మందిరానికి భూమి పూజ..!
అయోధ్య రగడ ఎట్టకేలకు ముగిసిన సంగతి తెలిసిందే. సుప్రీమ్ కోర్ట్ ఎప్పటినుంచో నలుగుతూన్న ఈ సమస్యకు పరిష్కారం చూపింది. హిందువుల అయోధ్యను తిరిగి హిందువలకప్పగించింది. అయితే.. అక్కడ దేవాలయ స్థాపనకు కూడా మొదటి మెట్టు పడింది. ఎప్పటినుంచో హిందువులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్యలో ఉన్న రామజన్మభూమి ప్రాంతంలో రామ మందిర నిర్మాణం ఇవాళ ప్రారంభమైంది. అయోధ్య లో రామయ్య కు మందిరం కట్టాల్సిందేనని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
            శతాబ్దాల క్రితం శత్రుమూకల చేతిలో శిథిలమైన రాముడి ఆనవాళ్లను.. అచ్చంగా, అంతకు మించి అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకం తో.. భూమి పూజ ను ప్రారంభించినట్లు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. అయితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి బెడద ఉండడం తో ఈ కార్యక్రమానికి అతి కొద్దీ మంది ప్రముఖులు హాజరయ్యారు. 
 
            ఈ సందర్భం గా  "శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని" శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ చెప్పుకొచ్చారు. లంకపై దాడికి వెళ్ళేముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించినట్టుగానే.. రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధిపతి మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ వెల్లడించారు. పౌరోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య రామాలయానికి పునాదులు వేశారు. భూమి ని చదును చేసే కార్యక్రమాన్ని మే 11 న మొదలుపెట్టారు. నేడు ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. కరోనా లాక్ డౌన్ కారణం గా అయోధ్య రాముని దర్శనం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. సడలింపులు నేపధ్యం లో ప్రస్తుతం భక్తుల దర్శనానికి అనుమతులు ఇస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox