Breaking News

తుఫాన్ గాలికి విద్యుత్ స్థంభం కూలి పడివ్యక్తి మృతి..!

04 th Jun 2020, UTC

నిన్న సాయంత్రం అల్పపీడనం పెను తుఫాను గా మారి తీరం దాటిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై లో ఈ ప్రభావం కొంత మేర కనిపించింది. నిన్న సాయంత్రం ఓ 58 ఏళ్ల వ్యక్తి ఇంటికెళుతున్న సమయం లో తుఫాను గాలికి విద్యుత్ స్తంభం కూలి పడటం తో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని ఉమతే గ్రామంలో బుధవారం (జూన్ 3) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని దశరథ్ బాబు వాగ్మరేగా గుర్తించారు. తుఫాన్ తీరం దాటుతుండటంతో ఇంటికి పరుగు అందుకున్న దశరథ్‌పై విద్యత్ స్తంభం ఒక్కసారిగా కూలి మీదపడింది.
        మరో వైపు పూణే జిల్లాలో తుఫాను కారణం గా ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర తుఫాన్‌గా మారిన నిసర్గ తీరం దాటిన సమయంలో పెను గాలులు వీశాయి. గంటలకు 100 కి.మీ. వేగంతో వీచిన గాలులతో అలీబాగ్‌తో పాటు పుణేలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద వృక్షాలు కూలి వాహనాలపై పడటం తో అవి ద్వంసమయ్యాయి. తీరం దాటిన తర్వాత తుఫాన్ బలహీనం అవడం తో ముంబై ఊపిరి పీల్చుకుంది. దాదాపు వందేళ్ల తరువాత ముంబై వైపు తుఫాన్ దూసుకొచ్చింది. అయితే.. పెద్ద గా ప్రభావం చూపలేదు.. దీనితో ప్రజలు ఊరట పొందారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox