Breaking News

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా...? మీకు బాడ్ న్యూస్..!

02 nd Jun 2020, UTC

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కి చాలా మందే అభిమానులు ఉన్నారు. తాజాగా.. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపధ్యం లో మొబైల్ ఫోన్ల అమ్మకాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన స్మార్ట్ ఫోన్ ల ధరలు పెంచి వినియోగదారులకు బాడ్ న్యూస్ చెప్పింది. ఏయే మొబైల్స్ పై ఎంతెంత ధర పెరిగిందో ఇపుడు తెలుసుకుందాం..
           షియోమీ తన రెడ్ మీ ఏ డ్యూయల్, రెడ్ మీ 8, రెడ్ మీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడం ఇది మూడోసారి. ఎంఐ.కాం, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వెబ్ సైట్లలో పెరిగిన ధరలతోనే ఈ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఆఫ్ లైన్ స్టోర్లలో ప్రస్తుతానికి పాత ధరలే ఉన్నా.. త్వరలోనే ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ ధర రూ.500, రెడ్ మీ 8, రెడ్ మీ 8ఏ డ్యూయల్ స్మార్ట్ ఫోన్ల ధరలు రూ.200 వరకు పెంచుతున్నట్లు షియోమి ప్రకటించింది.
           గతం లో రెడ్ మీ నోట్ 8 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499గా ఉండగా, ఇప్పుడు రూ.500 పెరగడంతో అది రూ.11,999కు పెరిగింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 నుంచి రూ.14,499కు పెరిగింది.రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,299 నుంచి రూ.9,499కు పెరిగింది. అలాగే రెడ్ మీ 8ఏ డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.200 పెరిగింది. దీంతో ఈ ఫోన్ 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499కు పెరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గానే ఉంది.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox