Breaking News

చంద్రబాబు దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారు:విజయసాయి రెడ్డి

13 th Jun 2020, UTC

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు.

శనివారం ట్విటర్‌లో..  చంద్రబాబు నాయుడు భారత్‌నుంచి పారిపోవటానికి చూస్తున్నట్లు తెలిసింది. ఇక్కడినుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవటానికి తన మిత్రుడు, పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్న ఓ పారిశ్రామికవేత్తను సంప్రదించినట్లు విన్నాను అని పేర్కొన్నారు.

 చంద్రబాబు, లోకేష్‌ బాబుల ద్వయం లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ భద్రత కలిగిన ప్రదేశమని అనుకున్నారు. కానీ, ఇప్పుడు విచారణ సంస్థల నుంచి తప్పించుకోవటానికి మరో చోటు కోసం అన్వేషిస్తున్నారు అని అన్నారు.

మరో ట్వీట్‌లో.. అచ్చెన్న, ఉమా, యనమల, కాల్వ, పరిటాల, నారాయణ ఇలా టీడీపీ హయాంలోని మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60 శాతం పెద బాబు, చిన బాబులకు ముడుపులుగా వెళ్లాయని ఆరోపించారు విజయసాయిరెడ్డి. అందుకే అవినీతిని ప్రోత్సహించారు.. ఇప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అంటూ సెటైర్లు పేల్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox