Breaking News

రోజా పై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు..!

12 th Jun 2020, UTC
రోజా పై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు..!
ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రోజా పాత్ర నామమాత్రమే అని, గతంలో జగన్ జైలు  శిక్ష అనుభవించిన విషయాన్ని మరిచి పోతే ఎలా అంటూ ప్రశ్నించారు. జగన్ కేసులపై రోజా మాట్లాడాలన్న దివ్యవాణి అచ్చెన్నాయుడి అరెస్ట్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు.

 రోజా నువ్వు అడుగు పెట్టగానే సినిమాకి ఎండ్ కార్డ్ పడింది మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. ‘‘జైల్లో జగ్గూ’ అనే సీరియల్ 16 నెలలు సాగింది, ఇప్పటికీ ప్రతి శుక్రవారం వస్తుంది చూడటం లేదా? 16ఏళ్ల పాటు జైలుకి రావాలి జగన్.. కావాలి జగన్ అనే పాట కంపోజింగ్‌లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్ రెడ్డి అవినీతి చిట్టా సీబీఐ బయటపెట్టిందన్నారు. దానికి సమాధానం రోజా చెబుతుందా? అని ప్రశ్నించారు.

వైసీపీలో రోజా ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే అనే విషయాన్ని గుర్తిస్తే మంచిందంటూ దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలు, కక్ష తీర్చుకోవడం తప్ప ఏడాది పాలనలో జగన్ సాధించిందేమీ లేదన్నారు. ఒకవేళ ఏమైనా ఉంటే చెప్పే ధైర్యం రోజా రెడ్డికి ఉందా అని అన్నారు. ఒక బీసీ నేతను అరెస్ట్ చేశామన్న సైకో ఆనందం తప్ప ఒక్క ఆధారమైనా చూపించగలిగారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox