Breaking News

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది:నారా లోకేష్

09 th Jun 2020, UTC

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని నారా లోకేష్‌ విమర్శించారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌ పేరుతో..వైసీపీ ఏడాది పాలనపై నారా లోకేష్‌ చార్జిషీట్ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.వైసీపీ ఏడాది పాలనలో నవ మోసాలు, నవ కుంభకోణాలు, ప్రజలు కష్టాలు పడుతుంటే జగన్‌రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు. జగన్‌రెడ్డి పాలనపై వైసీపీ నేతలే విమర్శిస్తున్నారు. ప్రతి పథకానికి కండీషన్ అప్లయ్‌ అంటున్నారు. ఏడాదిలో 564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు భరోసా పేరుతో రైతులను, పెన్షన్‌ పెంపు పేరుతో పేదలను మోసం చేశారు. చీప్‌ లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్‌రెడ్డి పనిచేస్తున్నారు. మద్యం పేరుతో ప్రజలపై రూ. 25 వేల కోట్ల జే ట్యాక్స్‌ వేస్తున్నారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ నిధులను అమ్మ ఒడికి మళ్లించారు. ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇసుక దొరకడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. యూనిట్‌ రూ.11 చొప్పున పక్కరాష్ట్రాల నుంచి విద్యుత్ కొంటున్నారు. విద్యుత్ బిల్లు చూస్తే షాక్‌ కొడుతోంది అని నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

 కరోనా టెస్ట్‌ కిట్లలో రూ. కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారు. బ్లీచింగ్ పౌడర్‌ పేరుతో సున్నం కొట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు పెరిగాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 34 పథకాలను రద్దు చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. మడ అడవులను మడతబెట్టేశారు.. ఆవ భూములను కబ్జా చేశారు. జగన్‌ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. దళితులకు పెద్దపీట వేస్తామని చెప్పి దాడులు చేస్తున్నారు. విశాఖలో మాస్క్‌లు అడిగిన డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా వేధించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పిన దొంగ పనులు చేయలేదని.. చిత్తూరులో డా.అనితారాణిని నిర్బంధించి వేధిస్తున్నారు.

జగన్‌ రెడ్డి పాలనను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఏపీలో ఏడాదిలోనే 370 అత్యాచార ఘటనలు జరిగాయి. మీరు తీసుకొచ్చిన దిశ చట్టం కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదు. రంగుల విషయంలో హైకోర్టు తీర్పులనే ధిక్కరించారు. రంగుల పేరుతో రూ.2వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. జగన్‌ రెడ్డి సొంత పేరు అబద్ధం, జగన్‌రెడ్డి మతం విధ్వంసం, కులం కక్షపూరితం. సొంత బాబాయ్‌ హత్యపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు?, రాజధానిని తరలించబోమని చెప్పిన జగన్.. ఇప్పుడు మూడు ముక్కల రాజధాని అంటున్నారు. రాజధానిలో అవినీతి జరిగితే ఏడాదిలో ఎందుకు నిరూపించలేక పోయారు?, ఏపీలో అభివృద్ధి సున్నా.. జగన్‌ వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మాకొద్దు జగన్‌ అని ప్రజలు.. పోవాలి జగన్‌ అని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. విధ్వంసంలో ఏపీని అగ్రస్థానానికి తీసుకొచ్చారు. జగన్‌ గన్నేరు పప్పులా తయారయ్యారు’’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

.@ysjagan గారు ఏడాది కాలంలో రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టించారో, ప్రజలని ఎంత మోసం చేసారో, అభివృద్ధిని ఎలా నాశనం చేసారో, రాష్ట్ర పరువును ఎంతలా దిగజార్చారో ... ఈ వీడియో చక్కగా వివరించింది. (1/2)#VidhvamsaanikiOkkaChance pic.twitter.com/SjoKuVbKqx

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox