Breaking News

చేసిందే మరలా చేయడం. ఫలితాలు ఆశించడం పిచ్చితనం :రాహుల్ గాంధీ

13 th Jun 2020, UTC

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, అష్ట దిగ్బంధనాన్ని పొడిగిస్తుండటంపై  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ట్విటర్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.

శనివారం ఇచ్చిన ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడుతూ, కోవిడ్-19 కేసులు పెరుగుతుండటాన్ని చూపించే నాలుగు గ్రాఫ్‌లను షేర్ చేశారు. చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం, విభిన్న ఫలితాలు ఆశించడం పిచ్చితనం అని పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వ తీరును వరుసగా రెండో రోజు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శుక్రవారం కూడా ఆయన ఓ ట్వీట్ చేశారు.

 అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత దేశంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, భారత దేశం తప్పుడు పోటీలో విజేతగా నిలిచేందుకు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అహంకారం, అసమర్థత ప్రాణాంతకంగా కలగలిసిన ఫలితం ఈ భయానక విషాదమని పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox