Breaking News

టీఆర్ ఎస్ మంత్రులంతా గంపకింద పిల్లలే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

03 rd Jun 2020, UTC

కేసీఆర్‌ను సంతోష పెట్టాలనే మంత్రులు మాట్లాడుతున్నారు తప్ప.. మంత్రులంతా గంప కింద పిల్లలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 కాంగ్రెస్ హయాంలో రాజకీయాల కోసం చట్టాలను ఉపయోగించలేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు పోలీసులను వాడుకుంటోందని ధ్వజమెత్తారు. కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని.. ఇక అసెంబ్లీలో అయితే మాట్లాడే ఛాన్స్ లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు. కృష్ణానదిపై పెండింగ్‌లో ఉన్న 7 ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. 10 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు.

 కాంగ్రెస్‌కు పేరొస్తుందని 90 శాతం పూర్తైన ప్రాజెక్ట్‌ల్ని పక్కనపెట్టారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తున్న.. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. కాళేశ్వరం పేరుతో స్వర్గం చూపుతున్నారని.. నీళ్లు గ్రాఫిక్స్‌లో తప్ప పొలాలకు రావడం లేదని ఎద్దేవా చేశారు. నీళ్లు ఇస్తున్నామని చెబుతున్న మంత్రులకు దమ్ముంటే వచ్చి... సింగూరు, మంజీరాలో నీళ్లు చూపించాలని సవాల్ విసిరారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox