Breaking News

మ్యాచ్ 4 గం.కి ఐతే... స్కూల్ బంక్ కొట్టావా..? రైనా కి భజ్జీ షాక్..!

02 nd Jun 2020, UTC

భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాకి హర్భజన్ సింగ్ సూపర్ పంచ్ వేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో...1998లో షార్జా వేదికగా జరిగిన కోకాకోలా సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసేందుకు అప్పట్లో స్కూల్ బంక్ కొట్టినట్లు రైనా చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ మ్యాచ్ లో సచిన్ తో కలిసి ఆడిన హర్భజన్ సింగ్ ఆ వీడియో చూసి.. ఆ మ్యాచ్ జరిగిందే సాయంత్రం నాలుగు గంటలకు అయితే... నువ్వు స్కూల్ బంక్ ఎలా కొట్టావ్ అని అడిగాడు. 
        ఓ ఇంటర్వ్యూ లో రైనా.."అప్పట్లో మా ఇంట్లో టీవీ ఉండేది. అయితే.. అందులో కేవలం దూరదర్శన్ మాత్రమే వచ్చేది. దాంతో ఆ సిరీస్‌ని చూసేందుకు నేను స్కూల్ చివరి రెండు పీరియడ్స్‌ని బంక్ కొట్టేవాడ్ని. అప్పట్లో సచిన్ ఓపెనర్‌గా ఆడేవాడు. నేను కేవలం సచిన్ లేదా రాహుల్ డ్రవిడ్ బ్యాటింగ్ మాత్రమే చూసేవాడ్ని. ఒకవేళ సచిన్ ఔటైతే.. టీవీ ముందు నుంచి వెళ్లిపోయేవాడ్ని. అప్పుడు నాకు 12 ఏళ్లు ఉంటాయి" అని చెప్పాడు. దానికి బదులు గా భజ్జీ..."స్కూల్ బంక్ ఎలా..? భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి ప్రారంభమయ్యేవి. నేను ఆ సిరీస్‌లో ఆడాను" అని కౌంటర్ వేశారు. దీనికి ఇప్పటివరకు రైనా స్పందించలేదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox