Breaking News

అచ్చెన్న హయాంలో అడ్డగోలుగా అవినీతి..!

12 th Jun 2020, UTC
అచ్చెన్న హయాంలో  అడ్డగోలుగా అవినీతి..!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్మికశాఖా మంత్రిగా అచ్చెన్నాయుడు వందలకోట్ల అవినీతికి తెరలేపారు. నిభందనలను పక్కన పెట్టి తన సొంత సంస్దకు కాంట్రాక్టు ఇవ్వాలంటూ స్వయంగా లేఖ రాసారు. ఈ ఎస్ ఐ ఆసుపత్రులకు మందులు, ఫర్నిచర్ కొనుగోళ్ల పేరిట ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో విజిలెన్స్ దర్యాప్తు లో తేలింది. దానికి సంభందించి వివరాలిలా వున్నాయి..

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) డైరెక్టర్లుగా డాక్టర్‌ బీ.రవికుమార్, సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్‌ జీ.విజయ్‌కుమార్‌ వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫర్నీచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వచ్చింది. ఆ డైరెక్టర్ల హయాంలో మందులు, ఔషధాల కొనుగోలు కోసం రూ.293.51 కోట్లు కేటాయించగా, యథేచ్ఛగా ఆ పరిమితిని మించి రేట్‌ కాంట్రాక్ట్, నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన మందుల, ఔషధాలు కొనుగోలు చేశారు. నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను తుంగలో తొక్కారు.

ర్యాన్‌డమ్‌గా చేసిన తనిఖీలో పర్చేజ్‌ ఇన్‌వాయిస్‌ ప్రైజ్, సేల్‌ ఇన్‌వాయిస్‌ ప్రైజ్‌ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. రాశి ఫార్మా, వీరేశ్‌ ఫార్మాల నుంచి రూ.15.93 కోట్ల విలువైన మందులు, ఔషధాలు కొనుగోలు చేశారు. ఆ మేరకు ఐఎంఎస్‌ డైరెక్టర్లు పర్చేజ్‌ ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఆ రెండు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌  సంస్థల ఇన్‌వాయిస్‌ ప్రైజ్‌ ప్రకారం ఆ మందులు, ఔషథాల అసలు ధర రూ.8.52 కోట్లు మాత్రమే. దానికి 20శాతం మార్జిన్‌ (లాభం) వేసుకుంటే ఆ ధర రూ.10.22 కోట్లు అవుతుంది. కానీ ఐఎంఎస్‌ డైరెక్టర్లు మాత్రం ఏకంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే రూ.5.70 కోట్లు అదనంగా చెల్లించారు. ఆ విధంగా అనేక నాన్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు

.వాస్తవానికి ల్యాబ్‌ కిట్స్‌ను హెమోక్యూ, బయోరాడ్, సీమెన్స్‌ వంటి ప్రొప్రైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘించి నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోలు చేశారు. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్, అవాంతర్‌ పర్ఫార్మెన్సెస్‌ ఇండియా లిమిటెడ్, ఓమ్ని మెడి వంటి నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి నామినేషన్‌ పద్ధతిలో రూ.237 కోట్ల విలువైన ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోలు చేశారు. ఆ విధంగా ఆయా సంస్థలకు 36 శాతం అధిక ధరలు చెల్లించారు.

నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి రూ.47.77 కోట్ల విలువైన సర్జికల్‌ ఉపకరణాలు కొనుగోలు చేశారు. దీంతో పాటు ఏ ఇండెంట్‌ లేకుండా మరో రూ.8.06 కోట్ల విలువైన సర్జికల్‌ ఐటెమ్స్‌ కూడా సేకరించారు. ఫర్నీచర్‌ కొనుగోలులో కూడా ఐఎంఎస్‌ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు. ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్‌ కొనుగోలు చేశారు.  ఫర్నీచర్‌ కొనుగోలులో ఐఎంఎస్‌ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు.
అచ్చెన్నాయుడు – టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్‌ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె.అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో ఏ టెండర్‌ పిలవకుండానే నామినేషన్‌ పద్ధతిలో ఆయన, టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ పనులు అప్పగించారు. టోల్‌ఫ్రీ సర్వీసులు, ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నారు.వివిధ అవసరాలతో పాటు, సహాయం కోరుతూ టోల్‌ ఫ్రీ సర్వీసుకు రోగులు చేసే ప్రతి కాల్‌కు (ఆ కాల్‌ అటెండ్‌ చేయకపోయినా సరే) నెలకు రూ.1.80, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించేలా డాక్టర్‌ రమేష్‌కుమార్‌ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్సు దర్యాప్తులో గుర్తించారు.

 ఎంఓయూ ప్రకారం వైద్య పరీక్షల కోసం డీఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ, పీజీ డిప్లొమా క్లినికల్‌ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు.

కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సీ.కే.విజయకుమార్, డాక్టర్‌ జి.విజయకుమార్‌ ఇద్దరూ టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు టోల్‌ఫ్రీ సర్వీస్‌కు గానూ రూ.4.15 కోట్లు, ఈసీజీ పరీక్షలకు సంబంధించి రూ.3.81 కోట్లు చెల్లించారు. మార్కెట్‌లో ఒక్కో బయోమెట్రిక్‌ ఉపకరణం ధర కేవలం రూ.16,992 మాత్రమే. అయినా ఓపెన్‌ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్‌ పద్ధతిలో ప్రొడిగీ కంప్యూటర్స్‌ నుంచి 100 బయోమెట్రిక్‌ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్‌ రమేష్‌కుమార్, అందుకోసం రూ.53.67 లక్షలు అదనంగా చెల్లించారు. వాటిలో చాలా వరకు యంత్రాలు పని చేయడం లేదని విజిలెన్సు అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox