Breaking News

6 రాష్ట్రాలనుంచి 67 లక్షల మంది కార్మికులు వెళ్లిపోయారు..!

12 th Jun 2020, UTC

లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు వరకూ దాదాపు 6 రాష్ట్రాల నుంచి 67 లక్షల మంది వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని ఓ సర్వే పేర్కొంది. ఈ విషయంపై కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖకు చెందిన పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వర్యంలో కొందరు కార్యదర్శులతో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ కమిటీ కేవలం బిహార్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు పరిమితమై.. లెక్కలు తీసింది.

ఈ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో బిహార్‌లోని 32 జిల్లాల నుంచి, యూపీలోని 31 జిల్లాల నుంచి, మధ్యప్రదేశ్‌లోని 22 జిల్లాల నుంచి, రాజస్థాన్‌లోని 4 జిల్లాల నుంచి, జార్ఖండ్‌లోని 3 జిల్లాల నుంచి వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని ఆ కమిటీ పేర్కొంది. వీరందరూ కూడా కాలినడక, శ్రామిక్ రైళ్లు, బస్సులు, టాక్సీల ద్వారా ప్రయాణం చేసినట్లు అందులో పొందుపరిచారు.

అయితే ఈ డేటాయే ఫైనల్ కాదని, ఇంకా కేరళ, అసోం, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ లాంటి కీలక రాష్ట్రాల నుంచి ఇంకా సమాచారం సేకరించాల్సి ఉందని కమిటీలోని అధికారులు స్పష్టం చేశారు. ఈ డేటా బయటికి రావడంతో 15 కేంద్ర మంత్రిత్వ శాఖలు... వలస కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో తలమునకలైపోయాయి. ఈ 15 శాఖలు కూడా విడివిడిగా తగు ప్లాన్‌లను సిద్ధం చేసి... ప్రధాని మోదీ ముందు ఉంచుతారని అధికారులు పేర్కొన్నారు.

మరికొన్న శ్రామిక్ రైళ్లు ఏర్పాటుచేయాలి..

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో  చిక్కుకు పోయిన  వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు మరికొన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని 7 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. కేరళ, తమిళనాడు, కాశ్మీర్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు మరో 63 ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox