Breaking News

24 గంటల్లో 11,929 కరోనా కేసులు..!

14 th Jun 2020, UTC
24 గంటల్లో 11,929   కరోనా కేసులు..!

దేశంలో  గడిచిన 24 గంటల్లో 11,929   కరోనా కేసులు నమోదవడంతో  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.  భారత్‌లో గడిచిన 24 గంటల్లో 311 మంది, ఇప్పటివరకు 9195 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,49,348గా ఉంది. కరోనానుంచి కోలుకుని మొత్తం 1,62,378 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, కరోనా కేసుల సంఖ్య నిన్న 3 లక్షలు మార్కు దాటిపోయి ప్రపంచ జాబితాలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్‌ ఉంది.

మహారాష్ట్రలోనే మూడో వంతు కేసులు...

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్‌–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైని వణికిస్తున్నాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044గా ఉంది.

ఢిల్లీలో విజృంబిస్తున్న కరోనా వైరస్..

దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 2,134 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,958కి చేరుకుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాజధానిలో 24 గంటల్లో 57 మంది మరణించగా.. మొత్తం 1,271మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో కరోనా కేసులు 40 వేలకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అమిత్‌షా నేతృత్వంలో అధికారులు సమావేశం కానున్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox