Breaking News

కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట..!

11 th Jun 2020, UTC
కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్ హౌస్ పై వివరణ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యులనల్ (NGT) ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..జాతీయ హరిత ట్రిబ్యునల్  ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది

 జన్వాడలోని ఫామ్ హౌస్ పై కొంతకాలంగా ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి  ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు.

దీనిపై ఎన్జీటీ లోనూ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన ఎన్జీటీ పిటిషన్ లోని అంశాల ఆధారంగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీజీ ఉత్తర్వులపై మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివాదస్పద ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.

అంతకుముందు ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై మంత్రి కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకందని అది రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆయన ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేసిందని విమర్శలు గుప్పించారు. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు.  అంతేకాకుండా ఆ వివాదాస్పద ఫాంహౌస్‌ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేవంత్‌ పిటిషన్‌పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox