Breaking News

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్..!

06 th Jun 2020, UTC
తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్..!

కరోనా నేపధ్యం లో పదవ తరగతి పరీక్షలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా లాక్ డౌన్ ను సడలించిన నేపధ్యం లో పరీక్షలు తిరిగి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. అయితే.. ఈ అంశం హై కోర్ట్ లో విచారణకు వచ్చింది... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవడానికి హై కోర్ట్ అనుమతి ని ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం.. ఆ రెండు జిల్లాలో కూడా పరీక్షలు నిర్వహించావడానికి అనుమతి కోరడం తో హై  కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా విద్యార్థి కరోనాతో మరణిస్తే ఆ బాధ్యత ఎవరిదని సూటిగా ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హై కోర్ట్ మరో సూచనను కూడా చేసింది.. "జీహెచ్ఎంసీ పరిధిలోని టెన్త్ విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని, సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ కింద గుర్తించాలని " హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox