Breaking News

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోకపోతే బర్తరఫ్‌ చేయాలి:రేవంత్ రెడ్డి

08 th Jun 2020, UTC

111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి విమర్శించారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తు చేశారు. డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్ చేసినప్పుడు.. కేటీఆర్‌ అక్కడ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారన్నారు.

జన్వాడ ఫాంహౌస్‌ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందన్నారు. 301 సర్వే నెంబర్లలో కేటీఆర్‌ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని రేవంత్ తెలిపారు. భూములు లేవని కేటీఆర్‌ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. వట్టినాగులపల్లిలో తమకు భూములున్న మాట వాస్తవమేనన్నారు. తన అక్రమ నిర్మాణం ఎక్కడున్నా కూల్చడానికి సిద్ధమని.. మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని.. లేదంటే బర్తరఫ్‌ చేయాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి నేడు జీహెచ్ఎంసీ కమిషన‌ర్‌ లోకేష్ కుమార్ ను కలిశారు. ఏడాది పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి పన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి పన్ను కట్టే స్తోమత ప్రస్తుతం లేదని రేవంత్ తెలిపారు. ఉన్నత వర్గాల నుంచి వసూలు చేసినా అభ్యంతరం లేదన్నారు. త్వరగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు అభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఆర్థిక పరిస్థితి బాలేదని ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. పేద, మధ్యతరగతి వారికి లాక్ డౌన్ సమయంలో ఆదాయం లేదని రేవంత్ పేర్కొన్నారు.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox