Breaking News

నేను ప్రమోషన్ కు పనికిరాను అనిపిస్తే జాబ్ వదిలేస్తా:టీఎస్ పీ ఏ డైరక్టర్ వీకే సింగ్

01 st Jun 2020, UTC

ఫైర్‌బ్రాండ్‌ ఐపీఎస్ గా పేరొందిన  వీకే సింగ్‌ మరోసారి  వార్తల్లో కెక్కారు. . ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు శిక్షణ కేంద్రం (టీఎస్ పీఏ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. తన పదోన్నతిపై ప్రభుత్వానికి లేఖ రాశారు. అదనపు డీజీగా ఉన్న తనకు నిబంధనల ప్రకారం డీజీగా ఎందుకు పదోన్నతి రావడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆ లేఖలో నిలదీశారు. ‘‘1987 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన నేను 33 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకున్నా. నేను డీజీగా ఎంపానల్‌ అయ్యాను. 1986 బ్యాచ్‌ ఐపీఎస్ లు మూడేళ్ల కిందటే పదోన్నతి పొందారు.

సరైన ఖాళీలు లేకుండానే.. 1989 బ్యాచ్‌ ఐఏఎ్‌సలకు పదోన్నతులు వచ్చాయి. ఏపీతోసహా ఇతర రాష్ట్రాల్లో 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు ఎప్పుడో పదోన్నతులు పొందారు. ప్రభు త్వం మా పట్ల చూపుతున్న నిర్లక్ష్యం నేపథ్యంలో పనిచేయలేకపోతున్నాం. నేను పదోన్నతికి పనికిరాను అని ప్రభుత్వం భావిస్తే.. ఈ ఉద్యోగాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. ఆ లేఖ ప్రతిని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రభుత్వ ముఖ్య సలహాదారులకు పంపారు.

వీకే సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. తన దైన పనితీరుతో ఎన్నో సంస్కరణలు అమలు చేసారు. వీటికి దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. కాని ప్రభుత్వం మాత్రం తరువాత  వీకే సింగ్ ను రాష్ట్ర ముద్రణా విభాగం డైరక్టర్ గా బదిలీ చేసింది. దీనిపై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచి సంచలనం సృష్టించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox