Breaking News

ఇంతకీ ఏమిటీ జీవో 111? ఎందుకు దీన్ని జారీ చేసారు?

06 th Jun 2020, UTC

మంత్రి కేటీఆర్ జన్వాడ గ్రామంలో 111 జీ. వో. కు విరుద్దంగా ఫామ్ హౌజ్ ను నిర్మించారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాధుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. దీనిపై కేటీఆర్ , తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులకు జారీ చేయడమే కాక నిజ నిర్దారణ కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ నోటీసులు, కమిటీల విషయాన్ని పక్కన పెడితే మరోసారి జీవో 111 తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏమిటీ జీవో 111? ఎందుకు దీన్ని జారీ చేసారు?

 మహానగరం మంచినీటి సరఫరా లో కీలకంగా వుండే హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ పరివాహాక ప్రాంతాలను మాస్టర్‌ ప్లాన్‌లో హెచ్‌ఎండీఏ బయో కన్జర్వేజన్‌ జోన్‌గా ప్రకటించింది. ఇందుకోసం జీవో నెం.111ను అమల్లోకి తెచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 2 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జలాశయాలను రక్షించేందుకు శంషాబాద్‌, మెయినాబాద్‌, రాజేంద్రనగర్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్‌ మండలాల్లోని 84గ్రామాల్లో నిర్మాణాలను నిషేధిస్తూ గతంలో ప్రభుత్వం 111జీవోను చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996లో   జారీ చేసింది.వరదనీరు సులువుగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాలకు చేరాలనేది ఈ జీవో ముఖ్య ఉద్దేశం. కాలుష్య వ్యర్థాలను నివారించడం కోసం కాలుష్య కారక పరిశ్రమలు, భారీ నివాస భవనాలు, పెద్ద హోటళ్ల నిర్మాణా?లపై ఆ జీవో ప్రకారం ఆంక్షలు విధించారు.దీని ప్రకారం ఈ ప్రాంతాల్లో కొత్తగా వెంచర్లు వేయడం లేదా అపార్ట్‌మెంట్లు నిర్మించడం నిషేధం.నిషేధిత ప్రాంతాల్లోని వెంచర్లు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్‌ చేయరాదనే ఆదేశాలు ఉన్నాయి. కేవలం వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలశయాలకు ఎగువన 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మొయినాబాద్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, కొత్తూరు, షాబాద్‌ మండల్లాలోని 84 గ్రామాలను ఈ జీవో కిందకు తెచ్చారు. దాని ప్రకారం, భూమిని కేవలం వ్యవసాయానికే ఉపయోగించుకోవాలి. నీటి కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఏం జరుగుతోంది?

ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు జీవో 111 జారీ చేసినప్పటికీ అది సక్రమంగా అమలు కావడం లేదు.  రియల్ ఎస్టేట్  వ్యాపారులు ఇక్కడ యదేచ్చగా వెంచర్లు వేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో వుండటంతో పలువురు సంపన్నులు ఇక్కడ గెస్ట్ హౌస్ లు, ఫామ్ హౌస్ లు  నిర్మించుకున్నారు.  . ఈ ఉల్లంఘనలపై కోర్టుల్లో ప్రజావాజ్యాలు కూడా నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా వెలసిన అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్  ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో రంగారెడ్డి, మహాబూనగర్‌ జిల్లా కలెక్టర్లు 111 జీవో పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల లెక్క తేల్చాలని జిల్లాల అధికార యంత్రాంగానికి సూచించారు.
 
ఇందులో భాగంగా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కలిసి 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అధికారులు కేటగిరీల వారీగా సమాచారం సేకరించారు. సాధారణ ఇళ్లు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలను వేర్వేరుగా లెక్కించారు.  ఇందులో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు గ్రామ కంఠం బయట సొంతంగా 3,927 ఇళ్లు నిర్మించారు. ఇందులో 281 బహుళ అంతస్తులు ఉన్నాయి. అలాగే 542 వాణిజ్యభవనాలు అక్రమంగా నిర్మించారు. అలాగే 85 పరిశ్రమలు అక్రమంగా ఏర్పాటు చేశారు. ఆయా ప్రభుత్వ శాఖలు కూడా నిబంధనలకు విరుద్ధంగా 63 నిర్మాణాలు చేపట్టినట్లు పరిశీలనలో వెల్లడైంది111 జీవో ప్రకారం భారీ భవన నిర్మాణాలపై నిషేధం ఉన్నప్పటికీ దాదాపు 12 వేలకు పైగా అక్రమ భవనాలను నిర్మించారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న మొయినాబాద్‌ మండలంలోని హిమాయత్‌నగర్‌, చిన్నమంగళారం, అజీజ్‌నగర్‌, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు.

స్దానికుల వాదనేమిటి?

అయితే ఈ జీవో వల్ల  జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల అభివృద్థి నిలిచిపోయిందని, ఈ జీవోలో కఠినమైన నిబంధనలను సడలించాలని అన్ని పార్టీలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు గోదావరి, కృష్ణా జలాల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది. ఈ రెండు చెరువులు వినియోగంలోలేవు.ఈ జీవో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, కాలనీలు, పరిశమ్రలు రాకుండా పోయాయి. చెరువులు వినియోగంలోలేనప్పుడు నిబంధనలను సడలించి పర్యావరణాన్ని కాపాడుతూ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అనేకసార్లు అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కోరారు.

కేసీఆర్ ఏమన్నారు?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 111ను సడలించి 84 గ్రామాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా నీళ్లను తీసుకువస్తున్నామని, ఇక హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నీళ్లతో అవసరముండదని ఆయన స్పష్టం చేశారు. 111 జీవోను ఎత్తివేస్తే హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఐటీ పరిశ్రమలు నెలకొల్పే అవకాశముంటుందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రధానంగా 111 జీవోను ఎత్తివేస్తామని 84 గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చింది.84 గ్రామాల్లో అభివృద్ధికి అడ్డుగా నిలిచినట్లుగా భావించే జీవో నెం 111లో మార్గదర్శకాలను సడలించి 84 గ్రామాల అభివృద్ధికి ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రాష్ట్రప్రభుత్వం రూపొందిస్తోంది. జీవో అమల్లో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌, శంషాబాద్‌, షాబాద్‌, కొత్తూరు, రాజేంద్ర నగర్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లోని 84 గ్రామాల్లో జీవో ఎత్తివేతకు అనుకూలంగా తీర్మానాలు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల తీర్మానాలను పరిశీలించిన తర్వాత ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అందులో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ప్రతినిధితో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ కలుషితం కాకుండా తీసుకునే చర్యలతో కూడిన నివేదికను ఉన్నత స్థాయి కమిటీ రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 111 జీవోను ప్రభుత్వం ఎత్తివేయనుంది. ప్రభుత్వ ఆలోచనను పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు. 111 జీవోను ఎత్తేస్తే హైదరాబాద్‌ కాలుష్యకాసారంగా మారుతుందని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంపై జీవో 111 రద్దు ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకువచ్చి హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని ప్రభుత్వం తీరుస్తుందే కానీ హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ నుంచి వెలువడే నీటి కాలుష్యాన్ని మాత్రం నివారించలేదని స్పష్టం చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ, 84 గ్రామాల అభివృద్ది.. ఈ రెండింటిలో సీఎం కేసీఆర్ గ్రామాల వైపే మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.  అందువలన వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జీవో111 కు సవరణ చేయడం అనేది ఖాయమే. మరో విషయమేమిటంటే ఇక్కడ అన్ని పార్టీలకు చెందిన నాయకులు, వారి అనుచరులు ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అందువలన కేసీఆర్ జీవో 111 ను రద్దు చేసినా, సవరణలు చేసినా  పార్టీ లకతీతంగా ఓకే అనడం ఖాయం. అపుడు రేవంత్ రెడ్డిది ఒంటరి పోరాటమే అవుతుంది. కేటీఆర్  ఫామ్ హౌస్ పై డ్రోన్ ను ప్రయోగించి రేవంత్ జైలు కెళ్లినపుడు కూడ ఎవరూ అండగా నిలబడక పోవడానికి కారణమిదే. కేసీఆర్ పై పోరాటానికియ ఈ ఇష్యూ కు బదులు రేవంత్ మరొకటి తీసుకుంటే బాగుండేదని కాంగ్రెస్ వాదులు సన్నాయి నొక్కులు నొక్కారు. వారి సంగతి సరే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? అభివృద్ది పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు సంబందించి సవరణలు చేయడానికి అనుమతిస్తుందా? లేదా అన్నది చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox